ATP: ఇటుకలపల్లి SLS కళ్యాణ మండపంలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈ సదస్సు జరిగింది. స్త్రీరక్ష పోర్టల్, శక్తి టీమ్ సేవలు, సైబర్ మోసాలు, పోక్సో చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా డయల్ 100 లేదా 112 ద్వారా పోలీసులను సంప్రదించాలని సూచించారు.