SS: పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత తన పర్యటనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేలా నిరాడంబరంగా పొదుపు చర్యలు పాటిస్తూ సైకిల్, ఎలక్ట్రిక్ స్కూటీలపై గ్రామాలు సందర్శిస్తున్నారు. శనివారం పెనుకొండ నుంచి తిమ్మాపురం వరకు ఎలక్ట్రిక్ బైక్పై ప్రయాణించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె శైలి స్థానికులకు ఆదర్శంగా నిలుస్తోంది.