WNP: వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు చేయాలని తెలంగాణ రైతాంగ సమితి డిమాండ్ చేసింది. పెబ్బేరు మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. రెండు నెలలుగా ధాన్యం ఉన్నా తాలు, తేమ, లారీలు లేవు అనే కారణాలతో కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య ఆరోపించారు.