AP: రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP EAPCET ప్రాథమిక కీ ఈరోజు విడుదల కానుంది. కీతో పాటు రెస్పాన్స్షీట్స్, మాస్టర్ ప్రశ్నపత్రం అందుబాటులో ఉంచనున్నారు. దీనిపై అభ్యంతరాలను 25 వరకు స్వీకరిస్తారు. ఫలితాలు జూన్ 1న విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,55,803 మంది దరఖాస్తు చేయగా 3,29,474 మంది పరీక్షలకు హాజరయ్యారు.