ప్రభాస్ ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఏకధాటిగా షూటింగ్లో పాల్గొంటూ.. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న.. మొహం పై చిరునవ్వుతోనే కనిపిస్తాడు డార్లింగ్. సినిమాల్లో తప్పితే ప్రభాస్‌ను బయట సీరియస్‌గా చూసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఆదిపురుష్ దర్శకుడి పై ప్రభాస్ నిజంగానే సీరియస్ అయ్యాడా.. అనే సందేహం రాక మానదు. అంతకుముందు.. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ లేదా టీజర్ కావాలని పట్టుబట్టిన అభిమానులు.. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ చేశారు. అయోధ్యలో భారీ ఎత్తున ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేయడమే ఆలస్యమన్నట్టు.. ఒక్కసారిగా డైరెక్టర్ పై విరుచుకు పడ్డారు నెటిజన్స్. ఆదిపురుష్ టీజర్ డిజప్పాయింట్ చేసిందని.. ఇదో యానిమేటేడ్ మూవీ అని ఒక్క మాటలో తేల్చేశారు. మరో వైపు సైఫ్ అలీఖాన్ రావణుడి లుక్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తంగా ఆదిపురుష్ టీజర్‌కు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయని చెప్పొచ్చు. అయితే ఆదిపురుష్ అవుట్ పుట్ పై ప్రభాస్ కూడా సంతృప్తిగా లేడనే ప్రచారం జరుగుతోంది. అందుకు నిదర్శనంగా ఓ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. అయోధ్యలో టీజర్ లాంచ్ తర్వాత హోటల్లో తన రూమ్‌కి వెళ్తున్న ప్రభాస్.. కాస్త సీరియస్‌గా దర్శకుడు ఓం రౌత్‌ని తన రూమ్‌కి రమ్మని పిలుస్తున్నట్లు ఉంది. దాంతో ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. రూమ్‌కు పిలిపించుకుని మరీ ఓం రౌత్‌కు ప్రభాస్ క్లాస్ పీకారనే టాక్ ఊపందుకుంది. అక్కడ జరిగిన అసలు మ్యాటర్ ఏమో గానీ.. టీజర్ పై నెగెటివ్ టాక్ రావడంతో.. ప్రభాస్ సీరియస్ అయ్యాడంటూ పుకార్లు మొదలయ్యాయి. మొత్తంగా ఆదిపురుష్ టీజర్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.