సూర్యాపేట: ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని సూర్యాపేట పోలీసులు నిరూపించారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుడెల్లి రంగా వద్దకు ఎస్సై మహేంద్రనాథ్ స్వయంగా వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు లింగయ్యపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని అందజేశారు. స్టేషన్కు రాలేని స్థితిలో ఉన్న బాధితులకు తక్షణమే స్పందించి న్యాయం చేస్తామని ఎస్సై అన్నారు.