NLG: చిట్యాల మండలం పెద్ద కాపర్తి ప్రాథమిక పాఠశాలలో టీబీ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని సర్పంచ్ కాటం వెంకటేశం శుక్రవారం ప్రారంభించారు. అధునాతన యంత్రం ద్వారా చెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో దాదాపు 100 మందికి పరీక్షలు చేయగా నలుగురికి టీబీ ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సైదులు, హెల్త్ అసిస్టెంట్ శ్రీను, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.