ATP: గుత్తిలో మట్కా నిర్వహిస్తూ, గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తూ, మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.1,10,000 నగదు, 13 మట్కా చీటీలు, 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్కు తరలించామన్నారు.