»Mollywood Anchor And Tv Host Subi Suresh Dies With Liver Problem
Subi Suresh: ప్రముఖ యాంకర్ కన్నుమూత.. సీఎం దిగ్భ్రాంతి
గృహనాథన్, తస్కర లహల, ఎల్సమ్మ ఎన్న ఆన్ కుట్టీ, హ్యాపీ హస్బెండ్స్, కనకసింహాసనం తదితర సినిమాల్లో సుభి నటించింది. ఇలా దాదాపు 20 సినిమాల్లో నటించింది. అతి చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం కలచి వేస్తోంది. ఆమె అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆమెకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.
యాంకర్ (Anchor)గా, నటిగా మలయాళం (Malayalam)లో మంచి క్రేజ్ సంపాదించిన యాంకర్ సుభి సురేశ్ (Subi Suresh) ఆకస్మిక మరణం చెందింది. దీంతో మలయాళ (Mollywood) వెండి, బుల్లితెర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యాంకర్, నటిగా రాణిస్తున్న క్రమంలోనే ఆమె హఠాన్మరణం పొందడం అందరినీ కలచివేస్తోంది. ఆమె మృతికి కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan సంతాపం తెలిపారు. ఇక మలయాళ సినీ పరిశ్రమ ప్రముఖులు, బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
మలయాళంలో ప్రముఖ యాంకర్ గా సుభి సురేశ్ (41) రాణిస్తుండేది. కాగా కొంతకాలంగా ఆమె కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నది. ఇటీవల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. అయితే ఆమె పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూనే ఆస్పత్రిలో బుధవారం కన్నుమూసింది. ఆమె మిమిక్రీ ఆర్టిస్ట్ కెరీర్ ను ప్రారంభించింది. కొచ్చిన్ కళాభవన్ ట్రూప్ లో ఉన్న సుభి మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా షోలు చేసింది. పురుషులపై జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తున్న ఆమె బుల్లితెరకు పరిచయమైంది. అనంతరం యాంకర్ గా టీవీ షోలు చేస్తూ బిజీగా మారింది. ‘సినీమాల’ ఆమెకు విశేష గుర్తింపు లభించింది. ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. షోలు చేస్తూనే మెల్లగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. గృహనాథన్, తస్కర లహల, ఎల్సమ్మ ఎన్న ఆన్ కుట్టీ, హ్యాపీ హస్బెండ్స్, కనకసింహాసనం తదితర సినిమాల్లో సుభి నటించింది. ఇలా దాదాపు 20 సినిమాల్లో నటించింది. అతి చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం కలచి వేస్తోంది. ఆమె అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆమెకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.