»Anchor Rashmi Gautam Responds On Street Dogs Incident
Street Dogs Attackపై యాంకర్ రష్మీ భావోద్వేగం.. బాలుడి మృతి చాలా బాధాకరం
సంఘటనపై తాజాగా యాంకర్ (Anchor), హీరోయిన్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) స్పందించింది. చిన్నారి మృతిపై అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కుక్కల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా రష్మీ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. బాలుడి మృతి ఆమెను కలచి వేసింది.
అన్యం పుణ్యం ఎరుగని బాలుడు వీధి కుక్కల (Street Dogs) దాడి (Dogs Attack)లో మృతి చెందాడు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ (Hot Topic)గా మారింది. చిన్నారిని కుక్కలు దాడి చేసుకుని పీక్కు తింటున్న దృశ్యాలు కలచివేశాయి. ఈ సంఘటనను చూసి అందరూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నది. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. బాలుడి కుటుంబానికి ఆయా పార్టీల నాయకులు పరామర్శలు చేస్తున్నాయి. ఈ సంఘటనపై తాజాగా యాంకర్ (Anchor), హీరోయిన్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) స్పందించింది. చిన్నారి మృతిపై అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కుక్కల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా రష్మీ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. బాలుడి మృతి ఆమెను కలచి వేసింది.
‘ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. తన తప్పు లేకుండానే వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందాడు. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కల జననాల నియంత్రణకు వ్యాక్సినేషన్ ను తప్పనిసరిగా అమలు చేయాలి. వాటితో పాటు కుక్కలకు ప్రత్యేకంగా వసతి సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే అవి కూడా మనలాగే జీవులు’ అని రష్మీ గౌతమ్ ట్వీట్ చేసింది.
జబర్దస్త్ (Jabardasth Show) షో ద్వారా రష్మీ యాంకర్ గా బుల్లి తెరకు పరిచయమైంది. అనంతరం పలు సినిమాల్లో (Movies) హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం టీవీ షోలపైనే ప్రధాన దృష్టి పెట్టింది. వివిధ ప్రత్యేక పండుగలతో పాటు పలు చానల్స్ లో ప్రసారమయ్యే షోలలో యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తోంది. కాగా రష్మీ జంతు ప్రేమికురాలు (Animal Lover). జంతువులకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. కరోనా (Corona) సమయంలో విధించిన లాక్ డౌన్ (Lockdown)లో వీధి కుక్కలు ఆహారం లేక తిప్పలు పడుతున్నాయని గ్రహించి రష్మీ ఆహారం అందించింది. లాక్ డౌన్ లోనూ బయటకు వచ్చి వీధి కుక్కలకు ఆహారం అందేలా తన ప్రయత్నాలు చేసింది.
కుక్కల దాడిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే బాలుడి మృతి కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కుక్కల సంఖ్య తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. బాధిత కుటుంబానికి సహాయం చేయాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.