»Actor Prabhu Hospitalised In Chennai Due To Kidney Problem
Prabhu నటుడు ప్రభుకి అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
ఇక రామ్ పోతినేని నటించిన ఒంగోలు గిత్త, జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి తదితర సినిమాల్లో ప్రభు నటించాడు. ఇచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే నటన ప్రభు సొంతం. ఇటీవల విడుదలైన విజయ్ సినిమా వారసుడులోనూ ప్రభు కనిపించారు.
భారతీయ సినీ పరిశ్రమ (Indian Cine Industry)కు కలిసి రావడం లేదు. సినీ పరిశ్రమలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ పరిశ్రమల్లో దిగ్గజాలు తుదిశ్వాస విడుస్తున్నారు. ఇక మరికొందరు ప్రముఖులు ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ నటుడు ప్రభు (Prabhu) అస్వస్థతకు గురయ్యాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని.. త్వరలోనే డిశ్చార్ అవుతాడని ప్రకటించారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు (Tamil Nadu)కు చెందిన స్టార్ నటుడు ప్రభు కిడ్నీ సంబంధిత సమస్య (Kidney)తో బాధపడుతున్నాడు. మంగళవారం అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబసభ్యులు చెన్నై (Chennai)లోని కెలంబాక్కం ప్రాంతంలో ఉన్న మెడ్వే ఆస్పత్రికి తరలించారు. అతడికి కిడ్నీలో రాళ్లు ఉండడంతో లేజర్ సర్జరీ ద్వారా వాటిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రభు పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఆయన ఆస్పత్రిలో చేరడంతో తమిళ ప్రేక్షకులు ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ (Sivaji Ganesan) తనయుడే ప్రభు. బాల్యంలోనే నటుడిగానే తెరంగేట్రం చేశాడు. బాలనటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రభు హీరోగానూ పలు సినిమాలు చేశాడు. 1982లో తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘షంగిలి’ సినిమాలో ప్రభు హీరోగా కనిపించాడు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. తండ్రి, బాబాయ్ వంటి సహాయ పాత్రల్లో నటిస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘అంజలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన ప్రభు కీలక పాత్రలో నటించాడు. ఇక ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాలో తండ్రి పాత్రలో ప్రభు కనిపించారు. ప్రభు, ప్రభాస్ తండ్రీకొడుకులుగా నటించి సందడి చేశారు. వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది.
ఇక యువ నటుడు రామ్ పోతినేని నటించిన ఒంగోలు గిత్త, జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి తదితర సినిమాల్లో ప్రభు నటించాడు. ఇచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే నటన ప్రభు సొంతం. ఇటీవల విడుదలైన విజయ్ సినిమా వారసుడులోనూ ప్రభు కనిపించారు. ప్రస్తుతం వరుసగా ప్రభు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రభు తన తండ్రి శివాజీ గణేశన్ మాదిరి రాజకీయాల్లోకి వచ్చాడు. 2018లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.