ADB: తలమడుగు మండలంలోని ఝరి, కొత్తూరు గ్రామాల్లో గురువారం కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం సమయంలోనే పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు.