కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో గురువారం బస్సు డిపో క్రాస్ రోడ్ వద్ద భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఛైర్మన్ సుహాసిని హాజరై ఆమె మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు.