PPM: జిల్లాలోని రైతులు పీఎం కిసాన్ పథకం లబ్ధి కొనసాగాలంటే ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకరరావు సూచించారు. రైతులు మొబైల్ ద్వారా లేదా గ్రామ రైతు సేవా కేంద్రాలు, సీఎస్సీ కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న APAIMS, APFR నమోదులను కూడా వెంటనే పూర్తి చేయాలని కోరారు.