KKD: పిఠాపురం నియోజకవర్గం ఎండపల్లి గ్రామంలో కాలువల మరమ్మత్తుల కోసం రూ.20 లక్షల నిధులు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పుంత కాలువ వద్ద పూడికతీత పనులను గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.