JN: రఘునాథపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రవి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు బస్టాండ్ వద్ద ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.