HYD: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం సహించబోమని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాటి నియంత్రణలో విఫలమైన అధికారులను ప్రశ్నించారు. ఫ్లెక్సీల విషయంలో పోలీసులు, జీహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.