TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 24 గ్రాముల బంగారం, మూడు బైకులు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.