SIR Project : ‘సార్’ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరు!?
SIR Project : వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'సార్'. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘సార్’. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో ఈ విడుదలైన ఈ చిత్రం.. డే వన్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి.. 50 కోట్ల క్లబ్లో ఎంటరైపోయింది. దాంతో సార్ లాభాల బాట పట్టినట్టే. ఇక ఈ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మామూలుగా మనోళ్లకు ఏదైనా సినిమా నచ్చితే.. హీరో, భాషాభేదం అనేది పట్టించుకోరు. ఇప్పుడు ధనుష్ విషయంలోను అదే జరిగింది. అయితే ప్రస్తుతం మన తెలుగు దర్శకులు తమిళ్ హీరోల వెంట పడుతున్నారు. దీనికి కారణం మన హీరోలు ఆ కథలను రిజెక్ట్ చేయడమేనని చెప్పొచ్చు. మాములుగా చాలామంది తెలుగు హీరోలకు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి. కంటెంట్ బలంగా ఉండి కొత్తగా ఉండే సినిమాలకు ఛాన్స్ ఇవ్వరు. ఆరు పాటలు, ఆరు ఫైట్లు కావాల్సిందే. ఇప్పుడంటే ఈ ఫార్మాట్ మారింది కానీ.. గతంలో గ్లామర్ షో, ఫారిన్లో సాంగ్స్ కావాల్సిందే. ఇప్పటికీ కొంతమంది ఇదే పంథాలో ఆలోచిస్తున్నారు. అందుకే సార్ సినిమాను కొంతమంది టాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. ఆ లిస్ట్‌లో న్యాచురల్ స్టార్ నాని కూడా ఉన్నాడని అటున్నారు. ముందుగా వెంకీ అట్లూరి ‘సార్’ కథను నానికి వినిపించాడట. అయితే ప్రయోగాలు చేయడంలో నాని ముందు వరుసలో ఉంటాడు. అందుకే ‘సార్’ కథ నానికి నచ్చినప్పటికీ.. ఇతర కమిట్మెంట్స్ కారణంగా.. రిజెక్ట్ చేసినట్టు టాక్ నడుస్తోంది. అయితే మిగతా హీరోలు ఎందుకు రిజెక్ట్ చేశారనేది.. వాళ్లకే తెలియాలి. ఇక అటు, ఇటు తిరిగి ఫైనల్‌గా ఈ కథ ధనుష్ దగ్గరికి వెళ్లడం.. ఆయన ఓకే చెప్పడం.. హిట్ కొట్టడం కూడా అయిపోయింది. ఏదేమైనా తెలుగు హీరోలు ఓ మంచి సినిమాను మిస్ చేసుకున్నట్టే!