KMM: కల్లూరు మండలంలో ఎండలు మండుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యుడు నవ్య కాంత్ సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దన్నారు. ఎండలో వెళ్లేవారు తలకు హెల్మెట్, ముఖానికి రుమాలు కట్టుకోవాలని, తెల్లటి దుస్తులు ధరించాలని కోరారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తరచూ మంచినీరు, నిమ్మరసం లేదా మజ్జిగ తాగాలని ఆయన కోరారు.