ATP: గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం దీపావళి పండుగ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి వేకువ జామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయంలో దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.