E.G: మామిడికుదురు మండలంలోని అప్పనపల్లిలో ఉన్న బాల బాలాజీ స్వామి వారిని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం దీపావళి పండుగను పురస్కరించుకుని సాధువులకు ఆయన వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.