SRD: నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ శెట్కార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని గురువారం కలిశారు. జాతీయ రహదారి 161 (బీ) నిజాంపేట్-నారాయణఖేడ్ మీదుగా చేపడుతున్న పనులతో పాటు కర్ణాటక సరిహద్దులో మిగిలిన 8 కిలోమీటర్ల రహదారికి నిధులు కేటాయించాలని కోరారు.