»Child Boy Fell Into A Washing Machine In New Delhi And Survived
Washing Machineలో పడ్డ బాలుడు.. పావు గంట తర్వాత ఏం జరిగిందంటే..?
గతంలో నీళ్ల ట్యాంకులు, గుంతల్లో పడడం.. నూనె, సాంబారు తదితర వాటిల్లో పిల్లలు పడిన సంఘటనలు జరిగాయి. కానీ వాషింగ్ మెషీన్ లో బాలుడు పడిన సంఘటన బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. అయినా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. పనులు చేస్తున్నప్పుడు పిల్లలపై కూడా కన్నేసి ఉండాలి. లేదంటే ఘోర ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మనకే మేలు.
వాషింగ్ మెషీన్ (Washing Machine)లో ఏడాదిన్నర బాలుడు పడిపోయాడు. బట్టలతో పాటు 15 నిమిషాలు మిషన్ లో తిరిగాడు. అనంతరం కుమారుడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గమనించి వెంటనే వాషింగ్ మెషీన్ ను ఆపేశారు. తీరా అందులో చిన్నారి కనిపించాడు. సర్ఫ్ డిటర్జెంట్ (Surf) నీళ్లతో కలిపి పావు గంట ఉండడంతో బాలుడు అస్వస్థతకు గురవడంతో పాటు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా బాలుడు కోమాలోకి వెళ్లాడు. కోమాలో నుంచి 7 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. మృత్యుంజయుడిగా ఆ బాలుడు నిలిచాడు. ఈ విచిత్ర సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
ఢిల్లీలోని వసంత్ కుంజ్ (Vasantkunj) ప్రాంతానికి చెందిన మహిళకు ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. బట్టలన్నీ పేరుకుపోవడంతో ఒక రోజు ఇంట్లోని టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ లో వేసింది. సర్ఫ్ వేసి మిషన్ ఆన్ చేసింది. ఇక ఇంట్లోకి వచ్చి పనులు చేసుకుంటుండగా కుమారుడు కనిపించలేదు. ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. ఒకసారి వాషింగ్ మెషీన్ వద్దకు అరుపులు వినిపించాయి. బట్టలతో పాటు బాలుడు కూడా మిషన్ లో తిరుగుతున్నాడు. ఇది చూసి షాక్ కు గురయిన ఆమె వెంటనే మిషన్ ను ఆపేసింది. మిషన్ లో నుంచి బాలుడిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించింది. సర్ఫ్ నీటిలో ఉండడం.. మిషన్ తో పాటు తిరగడంతో బాలుడికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో ఐసీయూ (ICU) వార్డులో ఉంచి చికిత్స అందించారు. అయితే ఈ సంఘటనతో బాలుడు కోమా (Coma)లోకి వెళ్లాడు.
కోమాలో ఉన్నని రోజులు ఆస్పత్రిలోనే బాలుడిని ఉంచారు. అయితే 7 రోజుల తర్వాత బాలుడు కోమాలోంచి కోలుకోవడం విశేషం. ప్రస్తుతం వైద్యం పొంది పూర్తి ఆరోగ్యంతో బాలుడు ఇంటికి చేరాడు. మృత్యుంజయుడిగా కుమారుడు బయటకు రావడంతో ఆ తల్లి ఆనందం రెట్టింపైంది. బాలుడికి పునర్జన్మ దక్కడంతో ఆ కుటుంబసభ్యులంతా ఆనందంలో మునిగారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరలైంది. అయితే బాలుడు మిషన్ లోకి ఎలా వెళ్లాడు అనేది ఇంకా తెలియలేదు. మిషన్ వద్ద కుర్చీ (Chair) ఉండగా.. దానిపైకి ఎక్కి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. కుర్చీ సహాయంతో ఎక్కి మిషన్ లోకి పడిపోయి ఉంటాడని.. ఇది గమనించకుండా తల్లి మిషన్ లో బట్టలు వేసి ఆన్ చేసి ఉంటుందని ఊహించుకుంటున్నారు. ఏదీ ఏమైనా బాలుడు బతకడం సంతోషంగా ఉందని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గతంలో నీళ్ల ట్యాంకులు, గుంతల్లో పడడం.. నూనె, సాంబారు తదితర వాటిల్లో పిల్లలు పడిన సంఘటనలు జరిగాయి. కానీ వాషింగ్ మెషీన్ లో బాలుడు పడిన సంఘటన బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. అయినా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. పనులు చేస్తున్నప్పుడు పిల్లలపై కూడా కన్నేసి ఉండాలి. లేదంటే ఘోర ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మనకే మేలు.