KTR Tweet : ఆసిస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. మొత్తం నాలుగు టెస్టుల సీరిస్‌లో ఇప్పటికే ఇండియా రెండు టెస్ట్ మ్యాచ్‌లను సొంతం చేసుకున్నది. మొదటి టెస్ట్ మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించగా రెండో టెస్ట్ మ్యాచ్‌ను సైతం టీమిండియా మూడు రోజుల్లోనే కైవసం చేసుకోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీ రోల్ ప్లే చేయగా, విరాట్ కోహ్లీ తన కెరీర్లో 25 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఆసిస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. మొత్తం నాలుగు టెస్టుల సీరిస్‌లో ఇప్పటికే ఇండియా రెండు టెస్ట్ మ్యాచ్‌లను సొంతం చేసుకున్నది. మొదటి టెస్ట్ మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించగా రెండో టెస్ట్ మ్యాచ్‌ను సైతం టీమిండియా మూడు రోజుల్లోనే కైవసం చేసుకోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీ రోల్ ప్లే చేయగా, విరాట్ కోహ్లీ తన కెరీర్లో 25 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్ ఆద్యంతం అద్భుతాలు సృష్టించిన టీమిండియా కుర్రాళ్లపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. భారత జట్టు గొప్ప విజయం సాధించిందని ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఇక యువ ఆటగాడు కే శ్రీకర్ భరత్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతం చేశారని అన్నారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా 25 వేల పరుగులు మైలురాయిని అందుకోవడం దేశానికి గర్వకారణమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే కట్టడి చేసింది. కాగా, ఈ స్కోర్‌ను టీమిండియా జట్టు 26.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. వరసగా రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించడం అద్భుతమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక, బోర్డర్-గవాస్కర్ ట్రోఫినీ టీమిండియా జట్టు వరసగా మూడుసార్లు గెలుచుకున్నది. ఈసారి ఎలాగైనా గెలిచి టీమిండియాకు అడ్డుకట్ట వేయాలని చూసిన ఆస్ట్రేలియాకు రెండు మ్యాచ్‌లలో పరాభవం తప్పలేదు.