రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అవడానికి ఇంకొన్ని గంటలే ఉన్నాయి. ఇప్పటికే అయోధ్యలో ఆదిపురుష్ నామస్మరణ జరుగుతోంది. ఇక సోషల్ మీడియా అయితే హోరెత్తిపోతోంది. టీజర్ పోస్టర్‌కే సోషల్ మీడియాను షేక్ చేశారు అభిమానులు. ఇక టీజర్ రిలీజ్ అయితే ట్విట్టర్లో ఆదిపురుష్ ట్రెండ్ సెట్ చేయడం ఖాయమంటున్నారు. అందుకే టీజర్ రాక కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అది కూడా ఇంతకు ముందెన్నడు చూడని కోర మీసపు రామున్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నాడు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్. దాంతో అసలు ‘ఆదిపురుష్’ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. అందుకే టీజర్ ఎలా ఉంటుందోనని.. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ టీజర్ లాంచింగ్‌కు సర్వ సిద్దం చేశారు. ప్రస్తుతం ఈ భారీ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో రాత్రి 7.11 నిమిషాలకు సరయు నది ప్రాంతంలో.. భారీ స్థాయిలో ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ చేయనున్నారు. దాంతో అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ టీజర్లో అద్భుతమైన విజువల్స్‌తో పాటు.. రాముని గెటప్‌లో ప్రభాస్ నుంచి డైలాగ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఆదిపురుష్ సాలిడ్ ట్రీట్ ఇవ్వనున్నాడని చెప్పొచ్చు.