KMR: జిల్లా ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో గ్రామాలకు రోడ్లు వేస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఈ చిత్రం. మద్నూర్ మండలం అవల్ గావ్ గ్రామం నుంచి కొడిచిర గ్రామానికి వెళ్లే మార్గంలో తారు రోడ్డును గుర్తు తెలియని దుండగులు ట్రాక్టర్‌తో ధ్వంసం చేయడంతో రోడ్డు ధ్వంసం అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.