డబ్బు, అభరణాలతో హైవేపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఓ డెలివరీ వ్యాన్‌లో ఉన్న రూ.3.88 కోట్ల విలువైన 1400 కిలోల వెండి, ఇతర ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఆ క్రమంలో డ్రైవర్, క్లినర్లపై దాడి చేసి అభరణాలు ఎత్తుకెళ్లారు.
వాహనదారులు హైవేపై(high way) వెళుతున్నారా జాగ్రత్త సుమా!. అయితే గోల్డ్, పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దొంగలు హైవే రహదారులపై వాహనాలను అడ్డగించి దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా గుజరాత్(gujarat)లోని సురేంద్రనగర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఓ కొరియర్ కంపెనీకి చెందిన డెలివరీ వ్యాన్(delivery van)లో రూ.3.88 కోట్ల విలువైన 1400 కిలోల వెండి, ఇతర ఆభరణాల(imitation jewellery)ను డ్రైవర్, క్లినర్ కలిసి తీసుకెళ్తున్నారు. అదే క్రమంలో రాజ్‌కోట్-అహ్మదాబాద్ హైవేపై సైలా టౌన్(Sayla town) సమీపంలో దుండగులు మూడు కార్లలో వచ్చి వ్యాన్‌ను అడ్డగించారు. ఆ నేపథ్యంలో వారిని దుండగులు బెదిరించి వాహనంలో ఉన్న కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. అంతేకాదు డ్రైవర్, క్లీనర్లను తాళ్లతో వారిని కట్టేసి వారితో పాటు కొంత దూరం తీసుకెళ్లి ఓ వంతెన సమీపంలో వారిని వదిలేసి వెళ్లిపోయారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా(cc camera)లను పరిశీలించి దుండగుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆయా పరిధిలోని ప్రాంతాల్లో అనేక వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. దీంతోపాటు నిందితులను పట్టుకునేందుకు 15 బృందాల(groups)ను ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు.
ఇక మా వ్యాన్ ప్రతిరోజూ రాజ్‌కోట్(rajkot) నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయం (ahmedabad airport) వరకు విలువైన వస్తువులను డెలివరీ చేస్తుందని కొరియర్ కంపెనీ మేనేజర్ పింటు సింగ్ పేర్కొన్నారు. వ్యాన్ డ్రైవర్(driver) శుక్రవారం అర్థరాత్రి మరొకరి మొబైల్ నుంచి మాకు కాల్ చేసి, కొంతమంది వ్యక్తులు తనను కొట్టి నగల సంచులను దోచుకున్నారని తెలియజేశాడని వెల్లడించారు. అవి దాదాపు 50 మంది వ్యాపారులు, నగల వ్యాపారులకు చెందినవని కొరియర్ సంస్థ మేనేజర్ అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు పంపేందుకు ఆభరణాల సరుకును అహ్మదాబాద్ విమానాశ్రయానికి(ahmedabad airport) పంపుతున్నట్లు రాజ్‌కోట్‌కు చెందిన కొరియర్ కంపెనీ అధికారి వివరించారు.