NLR: నాయుడుపేట LIC ఆఫీస్ ప్రాంగణంలో ఏజెంట్లు మహా నిరసన చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ LIC మేనేజ్మెంట్ తమ సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో సోమవారం మహా నిరసన కార్యక్రమం చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల్యాద్రి నాయుడు, సంచి వీరాస్వామి, బాల గురునాథం ఏజెంట్లు పాల్గొన్నారు.