ఆసీస్‌తో జరిగే 5 టెస్టుల సిరీస్ నుంచి రుతురాజ్ గైక్వాడ్‌ను తొలగించడంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘రుతురాజ్ విషయంలో ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా?. రోజంతా హిట్టింగ్ చేయగల సత్తా ఉన్న బ్యాటర్ భారీ స్కోర్ చేసినా ఎంపిక చేయకపోతే ఇంకేం చేయాలి? ఎందుకు అతని కెరీర్‌తో ఆడుకుంటున్నారు. అతడిని పక్కన పెట్టడంలో ఉన్న లాజిక్ ఏంటో చెప్పాలి’ అని ప్రశ్నించాడు.