ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో ( hero)మోటోకార్ప్' (MotoCorp) తాజాగా జూమ్ హైటెక్ స్కూటర్ ను తెలంగాణ (Telangana) లో విడుదల చేసింది.ఇది 110 సీసీ స్కూటర్. మరే స్కూటర్ కు లేని విధంగా దీంట్లో తొలిసారిగా కార్నర్ బెండింగ్ లైట్స్ అమర్చారు.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హీరో ( hero)మోటోకార్ప్’ (MotoCorp) తాజాగా జూమ్ హైటెక్ స్కూటర్ ను తెలంగాణ (Telangana) లో విడుదల చేసింది. ఇది 110 సీసీ స్కూటర్. మరే స్కూటర్ కు లేని విధంగా దీంట్లో తొలిసారిగా కార్నర్ బెండింగ్ లైట్స్ అమర్చారు. మలుపులు తిరిగే సమయంలో ఒక్కోసారి వెలుతురు తక్కువగా ఉంటుంది. అయితే ఈ కార్నర్ బెండింగ్ లైట్లు ఎంతో ప్రకాశవంతమైన వెలుగును అందిస్తాయి. దాంతో రాత్రివేళల్లో సురక్షితంగా మలుపులు తిరిగేందుకు వీలుంటుంది. అంతేకాదు, 110 సీసీ సెగ్మెంట్లో మరే స్కూటర్ లకు లేనంత వెడల్పాటి టైర్లు జూమ్ సొంతం. ఇందులో బీఎస్-6 (Bs-6) ప్రమాణాలతో కూడిన ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఐ3ఎస్, డిజిటల్ స్పీడో మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. హీరో జూమ్ స్కూటర్ షీట్ డ్రమ్, కాస్ట్ డ్రమ్, కాస్ట్ డిస్క్ వేరియంట్లలో వస్తోంది. షీట్ డ్రమ్-ఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ.72,749, కాస్ట్ డ్రమ్-వీఎక్స్ ధర రూ.75,899, కాస్ట్ డిస్క్-జడ్ఎక్స్ ధర రూ.80,899 కాగా… ఇవన్నీ (Hyderabad) లో ఎక్స్ షోరూమ్ ధరలు. కొత్త మోడల్ కావడంతో ఇవి పరిచయ ధరలు మాత్రమే. తర్వాతి రోజుల్లో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి ఈ స్కూటర్ బుకింగ్లు ప్రారంభం కానున్నాయని హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.