New movie Teaser: చరణ్ చేతుల మీదుగా ఆది మూవీ టీజర్ రిలీజ్
యంగ్ హీరో ఆది సాయి కుమార్(Adi saikumar) నటించిన 'పులిమేక' (Puli Meka) అనే సినిమా ఓటీటీ(OTT)లో విడుదల కానుంది. సినిమా టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) రిలీజ్ చేశారు.
టాలీవుడ్లో ఇప్పుడంతా సస్పెన్స్ థ్రిల్లర్(Suspence Thriller) సినిమాల హవా నడుస్తోంది. విభిన్నమైన కథాంశంతో కుర్ర హీరోల దగ్గరి నుంచి పెద్ద హీరోల వరకూ సస్పెన్స్ సినిమాలు(Movies) చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా యంగ్ హీరో ఆది సాయి కుమార్(Adi saikumar) ఇటువంటి కథాంశంతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘పులిమేక’ (Puli Meka) అనే ఈ సినిమా ఓటీటీ(OTT)లో విడుదల కానుంది.
‘పులి మేక’ సినిమా టీజర్:
సాధారణంగా నేరాలు జరిగేటప్పుడు ప్రజలు ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తుంటారు. కానీ పోలీసులనే ఓ దుర్మార్గుడు టార్గెట్ చేసి హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారనే దానిపై కథ సాగుతుంది. మృగంలాంటి వేషంతో ఓ వ్యక్తి వరుస హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి అటువంటి హత్యలు ఎందుకు చేస్తాడు అనే విషయాలు తెలియాలంటే జీ5లో ‘పులిమేక'(Puli Meka) చూడాల్సిందే. ఫిబ్రవరి 24వ తేదిన ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్ జీ5 తమ ఆడియన్స్ కోసం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి భాషల్లో వైవిధ్యభరిత కంటెంట్ ను అందిస్తూ వస్తోంది. తాజాగా ఆ ఓటీటీ(OTT)లోనే ఫిబ్రవరి 24న పులిమేక సినిమా విడుదల కానుంది. ఇందులో లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్(Suspence Thriller) కథాంశంతో రూపొందిన ‘పులిమేక’ (Puli Meka) సినిమా టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ టీజర్(Teaser) విడుదలైన అద్భుతంగా ఆకట్టుకుంటోంది. మృగంలాంటి వేషంలో ఓ వ్యక్తి వరుసగా పోలీసులను హత్య చేస్తుంటాడు. ఈ హత్యలు ఎవరు చేస్తుంటారని పోలీసులంతా తలపట్టుకుంటారు. అప్పుడే ఈ కేసును సాల్వ్ చేయడానికి, హంతకుడిని పట్టుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్(Special Investigation) టీమ్ రెడీ అవుతుంది. ఆ టీమ్ కి హెడ్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ఉంటుంది. అదే టీమ్‌లో ఫోరెన్సిక్ టీమ్ మెంబర్‌గా ఆది సాయికుమార్(Adi saikumar) ఉంటాడు. వాళ్లిద్దరూ కలిసి హంతకుడిని పట్టుకుంటారు. ఈ విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 24వ తేది వరకూ వేచి చూడాల్సిందే.