»Lavanya Tripati Latest Photos Viral In Social Media
Lavanya Tripati : పెళ్లి తర్వాత తొలిసారి మేకప్ వేసుకున్న మెగా కోడలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం మామూలే. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తన భర్తతో కలిసి ఇంట్లోనే ఉంటోంది.
Lavanya Tripati : సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం మామూలే. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తన భర్తతో కలిసి ఇంట్లోనే ఉంటోంది. అయితే నాగబాబు కూతురు నిహారిక పెళ్లి చేసుకుని తన భర్తతో విడుకులు తీసుకున్న విషయం తెలిసిందే. నిహారిక కూడా పలు సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం నిహారిక సినిమా ప్రొడ్యూసర్‌గా చేస్తుందట. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. లావణ్య, వరుణ్ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
తాజాగా లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్‌లో ఫూల్ మేకప్‌తో కనిపించింది. పెళ్లి తర్వాత మత్తెక్కించే లుక్స్ తో చాలా హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. పెళ్లిలో సంప్రదాయ దుస్తుల్లో చూసిన లావణ్యను ఒక్కసారిగా అలా చూసి మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. లావణ్య ఎందుకు అంతలా మేకప్ వేసుకుందని, పెళ్లిలో కానీ పెళ్లికి ముందు కానీ ఎప్పుడు లావణ్యని ఇంత మేకప్‌లో చూడలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.