రాజస్థాన్(rajasthan)లోని అజ్మీర్(ajmer) జిల్లాలో ఎల్పీజీ(LPG) గ్యాస్ ట్యాంకర్ ట్రక్కు.. మార్బుల్ లోడుతో వెళ్తున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. దీంతోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రాణిబాగ్ రిసార్ట్ సమీపంలోని జాతీయ రహదారి-8పై గురువారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదం జరగడంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే గ్యాస్ ట్యాంకర్(gas tanker) పేలుడు దాటికి సుమారు 500 మీటర్ల మేర మంటలు వ్యాప్తి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు(police), అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Rajasthan | Four dead after a gas tanker collided with a truck on a national highway in Ajmer district last night, confirms Beawar police in Ajmer. pic.twitter.com/H0TUL3BSxB
మరోవైపు ఈ మంటల దాటికి ఆయా ప్రాంతాల్లోని షాపులు, నివాసాలకు విస్తరించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఆ క్రమంలో తమకు ఆస్తినష్టం సంభవించినట్లు వెల్లడించారు. అందకు సంబంధించిన నష్టం(loss)పై అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.