»Already Three People Have Been Arrested In The Hyderabad Terror Conspiracy Case New One More Person Has Been Arrested
hyderabad: ఉగ్ర కుట్ర కేసులో ఇప్పటికే ముగ్గురు..తాజాగా మరో వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ లో గత ఏడాది దసరా పండుగ సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఘటనను పోలీసులు చేధించారు. ఆ క్రమంలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తి మహ్మద్ అబ్దుల్ కలీమ్ సీట్, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్(hyderabad) లో గత సంవత్సరం పేలుళ్లకు ఉగ్రవాద కుట్ర(terror attack case) పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను ముందుగానే గుర్తించి పలువురిని అరెస్టు చేసిన పోలీసులు(police) తాజాగా ఈ కేసులో మరో వ్యక్తి మహ్మద్ అబ్దుల్ కలీమ్ సీట్, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని చంచల్ గూడ జైలుకు తరలించారు. పలు ఉగ్ర సంస్థలు 2022లో దసరా పండుగ సమయంలో భాగ్యనగరంలో వరుస పేలుళ్లకు ప్లాన్ వేశాయి. ఆ క్రమంలో అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫరూక్ కుట్రలో భాగంగా హైదరాబాద్లోనే మకాం వేసి పేలుళ్లకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయంగా వీరి కుట్ర గురించి తెలుసుకున్న పోలీసులు వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కుట్రను ఛేదించారు. ఆ క్రమంలో వారి నుంచి 4 చైనా గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో భాగంగా అరైస్టైన అబ్దుల్ జాహెద్ 2005లో టాస్క్ ఫోర్స్ ఆఫీసుపై బాంబు దాడి కేసులో ఇప్పటికే అరస్టయినట్లు తెలిసింది. అదే క్రమంలో 2017 ఆగస్టు 1న విచారణ కూడా ఎదుర్కొన్నట్లు తేలింది. ఆ తర్వాత ఇటీవల మళ్లీ హైదరాబాద్లో పెద్ద ఉగ్ర దాడి(terror attack)కి ప్లాన్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఉగ్రకుట్ర అమలుకు పాకిస్తాన్ నుంచి హవాలా డబ్బు వచ్చేదని విచారణలో తెలిసింది. ఈ ఉగ్రకుట్ర(terror attack)అమలులో భాగంగా మరికొంత మంది ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్లు
2002 నవంబర్ 21న దిల్ సుఖ్ నగర్ సాయిబాబ ఆలయం దగ్గర పేలుడు, ఓ మహిళ మృతి, 22 మందికి గాయాలు
2004 నవంబర్ 12న జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ పక్కన బాంబ్ బ్లాస్ట్
2005 అక్టోబర్ 12న బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఆత్మాహుతి దాడి, హోంగార్డు మృతి మరో కానిస్టేబుల్ కు గాయాలు
2007 ఆగస్టు 25న కోఠి సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించగా దాదాపు 44 మంది మృతి