MHBD: జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మ గాంధీ పేరును తొలగించవద్దని కేకేసి బృందం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నర్సింహులపేట మండలం ముంగిమడుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్ దొంతు శారదరవి గౌడ్‌తో కలిసి ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.