AP: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు అనారోగ్యంతో మరణించారు. మూడు దశాబ్దాలపాటు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తి కొనసాగించిన ఆయన గ్రీన్ లాయర్‌గా ప్రసిద్ధి పొందారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా. తండ్రి అన్నంసుబ్బారావు తొలితరం న్యాయవాదిగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ కొనసాగించారు. ఎడీఎన్ రావు మృతిపట్ల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర సంతాపం ప్రకటించింది.