AP: బద్వేల్లో పెట్రోల్ దాడికి గురై మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. మరణించిన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.10 లక్షల చెక్కును మంజూరు చేశారు. ఈ మేరకు ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్, TDP నేత శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబానికి చెక్కు అందించారు. విద్యార్థిని కుటుంబసభ్యులతో సీఎం ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఈ కేసులో నిందితుడైన విఘ్నేశ్ ఇప్పటికే అరెస్టయ్యాడు.