GNTR: మేడికొండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.