Prakasam: మార్కాపురం పట్టణ ప్రజల కోసం కరోనా సమయంలో ప్రాణాలు తెగించి పని చేసిన కార్మికులను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించడం దారుణమని సీఐటీయు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన కార్మికుల ఆందోళన 12వ రోజుకు చేరింది. ఎన్నికల సమయంలో ముఠా కార్మికుల వారు బ్యాలెట్లు మోసారని వివరించారు.