SKLM: కూటమి ప్రభుత్వ రైతులకు రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపట్టిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం పాతపట్నం మండలం ఏఎస్ కమిటీలో గ్రామసభ అధికారులు నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. గత పాలకులు ల్యాండ్ టైటిలింగ్లో చేసిన మోసాలను రైతులకు వివరించారు. భూముల రిసర్వేల ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలన్నారు.