కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ మంగళవారం పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.