TG: హైదరాబాద్‌లోని హకీంపేట్, జవహర్‌నగర్ CRPF స్కూళ్లకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులను బయటకు పంపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. CRPF క్యాంప్‌లో ఉన్న స్కూళ్లను పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, దేశవ్యాప్తంగా CRPF క్యాంప్‌లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఆదివారం ఢిల్లీలోని CRPF స్కూల్లో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.