GNTR: పెట్టుబడిదారులకు మేలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల నినాదాన్ని తెరపైకి తెచ్చారని CPM పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు విమర్శించారు. గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సమకాలీన రాజకీయ పరిణామాలపై నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు హేతుబద్ధత లేని సాకులను మోదీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు.