AP: వైసీపీ తమపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి పార్థసారథి సూచించారు. ‘టీటీడీ పర్చేజ్ కమిటీ నిబంధనల మార్పుపై వైసీపీ వక్రభాష్యం చెబుతోంది. స్టార్టప్ డెయిరీలు కూడా టెండర్లో పాల్గొనేలా నిబంధనలు మార్చాం. కంపెనీల మధ్య పోటీతత్వం ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. పాలు లేకుండా, పామాయిల్‌తో కల్తీ చేసే వారిని అనుమతించాలని అనడం లేదు’ అని పేర్కొన్నారు.