Tongue Slip నోరుజారిన కిషన్ రెడ్డి.. రోజాను తెలంగాణ మంత్రి చేసిన వైనం
ఆర్కే రోజాను ప్రస్తావిస్తూ ‘ఇది వరకే తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక మంత్రి రోజా చెప్పారు’ అంటూ ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు ‘ఆంధ్రప్రదేశ్’ అని రెండు మూడుసార్లు చెప్పారు. ఈ పరిణామానికి వెంటనే తేరుకున్న కిషన్ రెడ్డి, రోజా ఇద్దరు గొల్లున నవ్వారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ నవ్వుకున్నారు. అయితే ఈ విషయమై రోజాకు వివరణ ఇస్తుండగా.. ‘పర్లేదు. కానీయండి’ అంటూ రోజా అన్నారు. అనంతరం యథావిధిగా కార్యక్రమం కొనసాగింది.
మాట మాట్లాడేటప్పుడు ఒక క్షణం ఆలోచించుకోవాలి. స్వీయ నియంత్రణ (Self Control) అనేది మనకు మనంగా విధించుకోవాలి. లేకుంటే ఒకసారి నోటి నుంచి జారిన మాటను వెనక్కి తీసుకోలేం. ఈ జాగ్రత్తలు ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఉండే రాజకీయ నాయకులు కచ్చితంగా పాటించాల్సిన విషయం. దీంతోపాటు అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే ప్రజల ఎదుట పరువు పోతుంది. ప్రజలు నిలదీసే అవకాశం ఉంది. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే పరువు బజారున పడుతుంది. సోషల్ మీడియా (Social Media)లో ట్రోలింగ్ కు గురి కాక తప్పదు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) నోరు జారారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా (RK Roja)ను తెలంగాణ (Telangana) సాంస్కృతిక, పర్యాటక మంత్రి అంటూ సంబోధించారు. అలాగే ప్రసంగం కొనసాగిస్తుండగా పక్కనున్న రోజా నవ్వేసింది. మిగతా నాయకులు కల్పించుకుని ఏపీ అని చెప్పడంతో ఆయన తేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. అమరావతిలో స్వదేశ్ దర్శన్ (Swadesh Darshan) పథకంలో భాగంగా అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు కిషన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో కలియ తిరిగారు. అంతకుముందు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరావతిలోని అమర లింగేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. అనంతరం బుద్ధిష్టు టూరిజం అభివృద్ధి పనులను ఏపీ సాంస్కృతిక, పర్యాటక మంత్రి ఆర్కే రోజాతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సుమారు రూ.27 కోట్లు వ్యయంతో బుద్ధవనం, ఆడిటోరియం, మెడిటేషన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, ఓపెన్ ఆపిరియో, మ్యూజియం పనులు చేశారు. స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని బౌద్ధ పర్యాటక కేంద్రాలైన శాలిహుండం, బావికొండ, అమరావతి, అనుపు ప్రాంతాల్లో పర్యాటక మౌలిక వసతులకు రిబ్బన్ కట్ చేశారు. ఇక బ్రిటన్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చిన పురాతన అమరావతి కళాఖండాన్ని ASIమ్యూజియానికి అప్పగించారు. విజయవాడ పర్యటనలో భాగంగా బాపూ మ్యూజియాన్ని కూడా సందర్శించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి, రోజా, బీజేపీ నాయకులు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విదేశాలకు స్మగ్లింగ్ అయిన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కళాకృతులను స్వదేశానికి తీసుకురావడం.. వాటిని సంబంధిత ప్రాంతాలకు అప్పగించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం. పర్యాటక అభివృద్ధికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మా ప్రభుత్వ చర్యలతో కశ్మీర్ ఇప్పుడు పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. గతేడాది అత్యధికంగా సందర్శించిన పర్యాటక ప్రాంతం కశ్మీర్ అని చెప్పేందుకు గర్విస్తున్నా. ఏపీలోని పలు పర్యాటక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది’ అని వివరాలు వెల్లడించారు. అనంతరం ఆర్కే రోజాను ప్రస్తావిస్తూ ‘ఇది వరకే తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక మంత్రి రోజా చెప్పారు’ అంటూ ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు ‘ఆంధ్రప్రదేశ్’ అని రెండు మూడుసార్లు చెప్పారు. ఈ పరిణామానికి వెంటనే తేరుకున్న కిషన్ రెడ్డి, రోజా ఇద్దరు గొల్లున నవ్వారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ నవ్వుకున్నారు. అయితే ఈ విషయమై రోజాకు వివరణ ఇస్తుండగా.. ‘పర్లేదు. కానీయండి’ అంటూ రోజా అన్నారు. అనంతరం యథావిధిగా కార్యక్రమం కొనసాగింది. అయితే ఈ సంఘటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైది. ముఖ్యంగా తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ, ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు మొదలుపెట్టాయి. ఎవరు.. ఏమింటో తెలియని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఎలా అయ్యాడో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏపీలోనైతే తెలంగాణ అని చెబుతున్నా రోజా మిన్నకుండడం ఏమిటని ఏపీ ప్రజలు నిలదీస్తున్నారు. మళ్లీ దానికొక నవ్వు అంటు కామెంట్లు చేస్తున్నారు. ఒకరేమో గుడ్డు.. ఇంకొకరేమో రాష్ట్రం పేరునే మార్చే మంత్రులు ఉన్నందుకు మేం బాధపడాల్సిన పరిస్థితి అని ఏపీవాసులు వాపోతున్నారు.
కుర్ కురే తెలివితేటలు🤣🤣 ఇంకా చెప్పు కిచ్చెన్న నేను కేంద్రమంత్రిని కాదు ఇంటర్నేషనల్ మంత్రిని అని🧘 pic.twitter.com/x7O9WhPVLj