బాహుబలి2లో ‘వీడెక్కడున్న రాజేరా’ అని చెప్పిన డైలాగ్ ప్రభాస్‌కు పర్ఫెక్ట్గా సూటయ్యేలా ఉందంటున్నారు రెబల్ స్టార్ అభిమానులు. అందుకు ఎన్నో ఉదాహరణలు చెబుతున్నారు. ఫ్యాన్స్ విషయంలో ప్రభాస్ కేరింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆదిపురుష్ టీజర్ లాంచింగ్ కార్యక్రమంతో ఇది ప్రూవ్ కాబోతందని అంటున్నారు. ఇటీవల కృష్ణంరాజును కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులందరికీ భోజనం పెట్టి మరీ పంపించాడు ప్రభాస్. అంత బాధలోను ప్రభాస్.. తన ఫ్యాన్స్ గురించి ఆలోచించడం సెన్సేషన్‌గా నిలిచింది. ఇక కృష్ణంరాజు స్వస్థలం మొగల్తూరులో భారీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేశారు. దాంతో ఆతిథ్యంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అని అంటున్నారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ విషయంలోను.. అభిమానుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడట డార్లింగ్. ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దాంతో అక్టోబర్ 2న అయోధ్యలో సరయు నది ఒడ్డున గ్రాండ్‌గా టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రానున్నారు. అందుకే వారందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయాలని.. చిత్ర యూనిట్‌ను కోరారట ప్రభాస్. దాంతో ఆదిపురుష్ టీం ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో.. ఇంతకు ముందు ఏ హీరో కూడా ఇలా చేయలేదంటూ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.