»Komatireddy Venkat Reddy Backstep His Alliance Comments
komatireddy venkat reddy:అబ్బే..తూచ్, నేనలా అనలే.. పొత్తు కామెంట్లపై వెనక్కి తగ్గిన కోమటిరెడ్డి
సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) రాష్ట్రంలో హంగ్ వస్తోందని.. బీఆర్ఎస్తో (brs) పొత్తు ఉంటుందని చెప్పారు. సొంత పార్టీ నేతలు విమర్శలు.. హై కమాండ్ ఆరా తీయడంతో వెంటనే నాలిక కరుచుకున్నారు. అబ్బే.. తాను అలా అనలేదని చెప్పారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
komatireddy venkat reddy: తెలంగాణ గడ్డ మీద ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. నవంబర్- డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సిద్దంగా ఉన్నాయి. ముఖ్య నేతలపై పొత్తులపై చేస్తోన్న కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) ఈ రోజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హంగ్ వస్తోందని.. బీఆర్ఎస్తో (brs) పొత్తు ఉంటుందని చెప్పారు. సొంత పార్టీ నేతలు విమర్శలు.. హై కమాండ్ ఆరా తీయడంతో వెంటనే నాలిక కరుచుకున్నారు. అబ్బే.. తాను అలా అనలేదని చెప్పారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ (Congress) పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే (Manikrao Thackeray)తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) సమావేశమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆయనతో చెప్పారు. రాహుల్ గాంధీ (rahul gandhi) చెప్పిందే తాను చెప్పానని వివరించారు. తమకు ఎవరితో పొత్తు ఉండదని కోమటిరెడ్డి (komatireddy) స్పష్టం చేశారు. బీజేపీ నేతలు (bjp leaders) కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా ఉంటుందని అన్నానని చెప్పారు. ఏ విషయమైనా సరే అర్ధం చేసుకునేదాన్ని బట్టి ఉంటుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తుందని తాను అనలేదని స్పష్టంచేశారు. తప్పు మాట్లాడలేదని, రాద్ధాంతం చేయెద్దని హితవు పలికారు. సోషల్ మీడియా (social media) సర్వేలను బట్టి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీట్లపై (congress seats) వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు మాణిక్‌రావు ఠాక్రే మీడియాతో మాట్లాడారు. పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పారు. కోమటిరెడ్డి (komatireddy) ఏం మాట్లాడారో తాను చూడలేదని తెలిపారు. ఆయన ఏం మాట్లాడారో తెలుసుకున్నాక స్పందిస్తానని తెలిపారు. పొత్తులపై రాహుల్ గాంధీ (rahul gandhi) వరంగల్ సభలో చెప్పిందే ఫైనల్ అని ఠాక్రే స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) చేసిన సంచలన వ్యాఖ్యలపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని అన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిర్ణయం హైకమాండ్ పరిధిలో ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టి అంతా పాదయాత్రలో (padayatra) ప్రజలు వివరించే సమస్యల మీదే ఉందని రేవంత్ రెడ్డి (revanth reddy) అన్నారు.