హైదరాబాద్ ఓయూ పీఎస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విషయంలో టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అయితే ‘నన్నే పోలీస్ స్టేషన్కు రమ్మంటావా’ అంటూ ఇన్స్పెక్టర్పై నిర్మాత దుర్భాషలాడాడు. శివరామకృష్ణతో పాటు ఆయన అనుచరులు పోలీసులపై దాడి చేశారు. కాగా ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు.