ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు తాజాగా కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ మూవీకి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీలో నటి దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా, ఇదే టైటిల్‌తో పవన్ కళ్యాణ్ సినిమా ఉన్న విషయం తెలిసిందే.